అరటి రైతులకు కాసుల పంట
NDL: అరటి సాగు రైతుల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం మార్కెట్లో అరటి ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 11 వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేశారు. గతంలో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ఉండగా, ప్రస్తుతం రూ.22 వేలు పలుకుతుండటం విశేషం. పెరిగిన ధరలతో పెట్టుబడి పోనూ లాభాలు వస్తాయంటున్నారు.