నూతన సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
VZM: ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలన్నది కూటమి ప్రబలమైన సంకల్పమని MLA పూసపాటి అతిది గజపతిరాజు అన్నారు. శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలసి వేణుగోపాలపురంలో 220/132/33 కె.వి. సామర్థ్యం గల నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో MLC కావలి గ్రీష్మ, కూటమి పార్టీల నాయకలు పాల్గొన్నారు.