15 నుంచి 'NO HELMET-NO PETROL'
TPT: డిసెంబర్ 15 నుంచి జిల్లాలో 'NO HELMET-NO PETROL' నిబంధన అమలు కానుందని పోలీసులు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మరణాలకు హెల్మెట్ లేకపోవడమే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. గురువారం సూళ్లూరుపేట బైపాస్ వద్ద SI బ్రహ్మనాయుడు వెళ్లి వాహనదారులకు పాంప్లెట్లు అందించి నిబంధనలు వివరించారు. MV Act Sec 194(D) ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరని తెలిపారు.