బహుళ పంటలతో రైతులకు ఆదాయం: కలెక్టర్
కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి రైతులు బహుళ పంటల విధానం అవలంబించాలని ఇవాళ సూచించారు. కలెక్టరేట్‌లో ఉల్లి సాగుపై అవగాహన కల్పించారు. గత ఏడాది ఏకపంట ఉల్లి సాగు చేసిన రైతులు అధిక వర్షాలు, మార్కెట్ మార్పులతో నష్టపోయారని తెలిపారు. బహుళ పంటలతో నష్టాలు తగ్గి స్థిరమైన ఆదాయం సాధ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.