జిల్లాలో గాలి కుంటు వ్యాధి టీకాలు
SDPT: కోహెడ మండలం వింజపల్లిలో శనివారం పశువులకు గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు వేశారు. సర్పంచ్ అన్నాడి శ్రీజ-జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పశువులకు వ్యాధులు సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పశుపాలకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పాడి పశువులకు టీకాలు వేయించారు.