స్వాతంత్య్ర దినోత్సవం.. జోరుగా మాంసం అమ్మకాలు

స్వాతంత్య్ర దినోత్సవం.. జోరుగా మాంసం అమ్మకాలు

NLR: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మద్యం, మాంసం అమ్మకూడదనే నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం కావలి పట్టణంలో మాంసం విక్రయాలు జరుపుతున్న దుకాణాలను శానిటరీ అధికారి నాగేశ్వరరావు మూసివేయించి, నడిరోడ్డుపై మాంసాన్ని కాల్చివేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.