తాడేపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని వడ్డేశ్వరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉండొచ్చని, జీన్స్ ప్యాంటు, గోధుమ రంగు చొక్కా ధరించి ఉన్నట్లు ఎస్సై ఖాజావలి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.