పీఏసీ సమావేశంలో ఎమ్మెల్యే రామాంజనేయులు
గుంటూరు: అమరావతి అసెంబ్లీ భవన్‌లో గురువారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆయన సమీక్షించారు. ఇతర సభ్యులతో కలిసి ప్రభుత్వపరమైన పలు విషయాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.