ప్రశంసాపత్రం అందుకున్న లేబర్ ఆఫీసర్
CTR: పుంగనూరు లేబర్ ఆఫీసర్ మధుబాబు విధి నిర్వహణలో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం అందజేసింది. చిత్తూరులో సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్, SP తుషార్ దూడి, MLAలు జగన్మోహన్, మురళీమోహన్‌లు మధు బాబుకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ.. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.