'రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి'
ప్రకాశం: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని పామూరు సీఐ శ్రీనివాసరావు సూచించారు. సీఐ కార్యాలయ ఆవరణలో రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లపై నిరంతరం పోలీస్ నిఘా కొనసాగుతుందని, పాత ప్రవృత్తిని విడనాడి, మంచిగా మెలగాలన్నారు. బెయిల్ పై తిరుగుతున్న రౌడీషీటర్లైనా మళ్లీ నేరాలకు పాల్పడితే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించారు.