మొజ్తాబా ఖమేనీకి ఎలాంటి సమస్యా లేదు: ఇరాన్
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఇటీవల దాడుల్లో గాయపడ్డారని అమెరికా వెల్లడించింది. ఈ వాదనలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. మొజ్తాబా ఖమేనీకి ఎలాంటి సమస్యా లేదని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం మొజ్తాబా తన విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. తమ దేశం పటిష్ట స్థితిలో ఉందన్నారు. ఒకవేళ కీలక వ్యక్తులకు ప్రాణనష్టం కలిగిన ఇరాన్ తట్టుకోగలదని చెప్పారు.