నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణకు సన్మానం
NZB: నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన బొబ్బిలి రామకృష్ణను మంగళవారం బొబ్బిలి వీధి అభివృద్ధి కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆకుల ప్రసాద్, పెద్ద అబ్బయ్య, మురళీసార్, భూపతి చందు సహా బొబ్బిలి వీధికి చెందిన పలువురు గల్లీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.