'వైకాపా ప్రభుత్వం రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టించింది'

NLR: జిల్లాలోని 45వ డివిజన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన రూ.3 వేల కోట్లు దారి మళ్లించిందని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా, రూ.10 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని వదిలిపోయిందన్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం డ్రెయిన్లు, తాగునీటి వంటి అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభించిందని తెలిపారు.