కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో అంబేద్కర్ జయంతి
SRPT: కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సై గోపాల్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.