ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

SKLM: పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష జన్మదిన వేడుకలను శుక్రవారం మందస మండలంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. హరిపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గౌతు శిరీషకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హరిపురం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.