రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం

రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం

NZB: జిల్లా ఆర్మూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో క్రయ విక్రయదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నా, ఆర్మూర్ కార్యాలయంలో మాత్రం సేవలు నిలిచిపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో కార్యాలయానికి వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.