కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సీపీఐ

MHBD: జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం సీపీఐ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి విజయ సారధి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.