'కనమహాలక్ష్మి సాక్షిగా బీజేపీ అబద్దాలు చెప్తుంది'

VSP: కనమహాలక్ష్మి అమ్మవారు సాక్షిగా బీజేపీ అబద్దాలు చెబుతోందని కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రియాంక దండి ఆదివారం విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీసి కార్పొరేట్లకు లబ్ధి కల్పిస్తున్నారని, జీఎస్టీతో ప్రజలను దోచి ఇప్పుడు జీఎస్టీ 2.0 పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలు, పోలవరం పనులపై బీజేపీ అబద్దాలు చెబుతుందన్నారు.