'రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది'
NRPT: న్యాయవ్యవస్థలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు కే. లక్ష్మీపతి గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ వెల్లడించారు. శనివారం నారాయణపేట జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు చట్టాన్ని తెలుసుకోవాలన్నారు.