భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఐఆర్టీఎస్ అధికారి
కోనసీమ: ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని బుధవారం ఐఆర్టీఎస్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. ఆలయ అధికారులు వారికి క్షేత్ర విశిష్టతను వివరించారు.