చెరువులా దర్శనమిస్తున్న ప్రధాన రోడ్డు
SKLM: హిరమండలం మండల కేంద్రంలో కాంప్లెక్స్, పాత బస్టాండ్ సమీపంలో చెరువుల్ని తలపించేలా గోతులు దర్శనమిస్తున్నాయి. అలికాం - బత్తిలి (ఏబి) ప్రధాన రహదారికి రెండు వైపులా డ్రైనేజీ లేకపోవడంతో వర్షం నీరు, వాడిక నీరు రోడ్డుపైనే నిలుస్తుంది. దీంతో వాహనదారులు రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని గోతులు పూడ్చాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.