VIDEO: 'రెండో విడత ఎన్నికలకు ఏర్పాటు పూర్తి'
MDK: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహణకు పంపిణీ చేస్తున్న సామాగ్రిని పరిశీలించారు. ఎన్నికలలో ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.