VIDEO: 'విద్యుత్తు కాంతులతో ముస్తాబైన మల్లికార్జున దేవస్థానం'
ADB: ఇచ్చోడ మండలం సిరిచెల్మా గ్రామంలో నెలకొన్న మల్లికార్జున స్వామి జాతర శనివారంతో 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. జాతరకు వచ్చిన భక్తులు కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి గర్భగుడిలోని శివలింగాన్ని నందులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం అగ్నిగుండం ప్రవేశంతో జాతర ముగుస్తుందని తెలిపారు.