BREAKING: సామాన్యులకు కేంద్రం GOOD NEWS
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో ఇంధన ధరలు పెరగబోవని స్పష్టం చేసింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ ప్రజలపై భారం వేయొద్దని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించనుంది. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందారు.