VIDEO: డ్రైనేజీ సమస్యతో స్థానికుల ఇబ్బందులు
GNTR: అంకిరెడ్డిపాలెం దాసుల కాలనీలో నెల రోజులుగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. కాలువలు పూడ్చివేయడంతో మురుగు నీరు రోడ్లపైకి చేరి తాగునీటిలో కలుస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.