'మహంకాళి శక్తి పీఠం కూల్చివేత యత్నాలు నిలిపివేయాలి'
వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి సమీపంలో ఉన్న శ్రీ మహంకాళి శక్తి పీఠాన్ని కూల్చివేయాలనే ప్రయత్నాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. బుధవారం ఆలయాన్ని కూల్చే చర్యలను వెంటనే నిలిపివేసి, అధికారులు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.