'మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్'

ADB: ఈనెల 8న పట్టణంలో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు నాగోరావ్ సోమవారం అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ తెలియజేశారు. తాగిన మైకంలో వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడు గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామస్తుడని పేర్కొన్నారు. ఉదయం పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పట్టుకోవటం జరిగిందని తెలిపారు.