'జన్నారం నియోజకవర్గంగా మార్చాలి'

'జన్నారం నియోజకవర్గంగా మార్చాలి'

MNCL: జన్నారం మండలాన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం జన్నారంలో సాధన కమిటీ నాయకులు సమావేశం నిర్వహించారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండటంతో అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంపీ, శాసనసభల పునర్వ్యవస్థీకరణకు ఆమోదించినట్లు తెలిసిందన్నారు.