ఎన్టీఆర్ నూతన విగ్రహ ఆవిష్కరణ

ఎన్టీఆర్ నూతన విగ్రహ ఆవిష్కరణ

PLD: మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శనివారం మాచర్ల మండలం, కొప్పునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపకులు, నందమూరి తారకరామారావు నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామ ప్రజలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.