కార్మికుల పిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు
VKB: జిల్లాలో భవన నిర్మాణ కార్మికులుగా నమోదైన కార్మికులు, ఇతర కార్మికుల పిల్లలకు విదేశాల్లో ఉద్యోగావకాశాలున్నాయని సహాయ కార్మిక కమిషనర్ B. వాల్య నిన్న తెలిపారు. 18 నుంచి 30 సం.ల మధ్య వయసు ఉండి కనీసం 8వ తరగతి పాసైన వారికి ఉచితంగా భాషా నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి అనంతరం విదేశీ ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తామన్నారు. వివరాలకు 9492555294 (VKB), 9492555293(తాండూరు)లను సంప్రదించాలన్నారు.