కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

KMR: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టినట్లు జిల్లా SP రాజేష్ చంద్ర తెలిపారు. గతేడాది 170 రోడ్డు ప్రమాదాలు జరిగి 179 మంది మరణించగా, 315 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఇదే కాలంలో 129 రోడ్డు ప్రమాదాలు మాత్రమే జరిగి 135 మంది మరణించగా, 272 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణలో జిల్లా పోలీసులు సాధించిన ఈ పురోగతిని రాష్ట్ర DGP జితేందర్ అభినందించారు.