సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి అభివృద్ధిని గెలిపించండి

సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి అభివృద్ధిని గెలిపించండి

చిత్తూరు: పెద్దపంజాణి మండలంలోని గోనుమాకులపల్లి గ్రామంలో ఆదివారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆదర్శవంతమైన అభివృద్ధిని చేసి చూపిస్తానని ఆయన వివరించారు. సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి అభివృద్ధిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.