రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలి: MLA
ADB: రాజకీయాలకు అతీతంగా బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని MLA అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. బజారహత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మాట్లాడారు. ఈనెల 6న నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయాలని MLA అనిల్ జాదవ్ కోరారు.