వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్
KMR: మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రంలో అమ్మకాలు చేసి లబ్ది పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు, బండి గోపి, సంగయప్ప తదితరులున్నారు.