సత్యసాయి శత జయంతి ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
సత్యసాయి: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్నారు. మహా సమాధి దర్శనం అనంతరం, మంత్రుల బృందం శాంతిభవన్‌లో సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులతో సమావేశమై ఏర్పాట్ల పురోగతిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.