అక్షరాలకు చెదలు.. శిథిలావస్థకు చేరిన గ్రంథాలయం

అక్షరాలకు చెదలు.. శిథిలావస్థకు చేరిన గ్రంథాలయం

WGL: వర్ధన్నపేటలో ఉన్న గ్రంథాలయం అక్షరాలకు చెదలు పట్టింది. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయంతోనే కొన్నేళ్లుగా పాఠకులు కాలం వెళ్లదీస్తున్నారు. విజ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాలయం పట్ల అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపకపోవడంతో మూలన పడిందని స్థానికులు మండిపడుతున్నారు. ఓ న్యూస్ పేపర్ తప్ప ఇతర పుస్తకాలు అందించడంలో కూడా అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.