రైతులు, మహిళలకు YCP క్షమాపణ చెప్పాలి: మంత్రి

AP: అమరావతి రైతులు, మహిళలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. అమరావతిని శ్మశానంతో పోల్చిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అమరావతిని రాజధాని అంటున్నారని మండిపడ్డారు. అధికారం కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చే తత్వం వైసీపీది అని ఎద్దేవా చేశారు. అమరావతి మునిగిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.