మర్పల్లిలో కుళ్లిన వ్యక్తి మృతదేహం

మర్పల్లిలో కుళ్లిన వ్యక్తి మృతదేహం

VKB: కోత్లాపుర్ గ్రామానికి చెందిన చామల మోహన్ రెడ్డి(32) గోవాకు వెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లాడు. పొలంలోని రేకుల షెడ్డు నుంచి శనివారం రాత్రి కుళ్లిన వాసన రావడంతో గ్రామస్థులు వెళ్లి చూశారు. షెడ్డులో ఉరివేసుకొని మృతదేహం కనిపించడంతో పొలం యజమానులకు సమాచారం అందించారు. మృతుడు మోహన్ రెడ్డిగా వారు నిర్ధారించారు.