'కాకినాడ జిల్లాలో పుష్కలంగా యూరియా'

'కాకినాడ జిల్లాలో పుష్కలంగా యూరియా'

కాకినాడ: జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు. ఈ సీజన్కు 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని గుర్తించగా, ఇప్పటికే 25,404 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం మరో 4,603 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత ఉంటే వెంటనే వ్యవసాయ శాఖను సంప్రదించాలని సూచించారు.