VIDEO: అకాల వర్షంతో నష్టపోయిన టమాటా రైతు

VIDEO: అకాల వర్షంతో నష్టపోయిన టమాటా రైతు

NTR: నందిగామ మండలం దాములూరులో అకాల వర్షాలు టమాటా సాగు చేసిన రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. వర్షాల ధాటికి పంటకు వ్యాధులు సోకి మొక్కలు కూలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. దిగుబడి బాగున్నా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.