రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

కృష్ణా: తిరువూరు మండలం చింతలపాడులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై ఇరువైపులా ధాన్యం బస్తాలు ఉంచడం వల్ల ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చిట్టెల గ్రామానికి చెందిన అంగిరేకుల గిరి అనే వ్యక్తికి తలకు గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం తిరువూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.