మంత్రాలయంలో అస్వస్థతకు గురైన భక్తుడు
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు ఇవాళ అస్వస్థతకు గురయ్యాడు. మంచాలమ్మ దేవి సన్నిధానం ముందు నిలబడి ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడుని భక్తులు తెలిపారు. గమనించిన తోటి భక్తులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం శ్రీ మఠం సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వాహనంలో శ్రీ మఠం ఆసుపత్రికి తరలించారు.