వలసదారులను వెనక్కి పంపించాలని MROకు వినతిపత్రం

వలసదారులను వెనక్కి పంపించాలని MROకు వినతిపత్రం

వరంగల్: భారతీయ జనతా పార్టీ రాయపర్తి మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా వలసదారులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.