ఉపాధ్యాయుడుని సత్కరించిన ఎంపీ కలిశెట్టి
VZM: మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ మరడాన సత్యారావుని సోమవారం స్దానిక MP కలిశెట్టి అప్పలనాయుడు సత్కరించారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతి విద్యార్ధులను విమానం ఎక్కించినందుకు అతడిని అభినందించారు. ఈ విద్యా సంవత్సరానికి చీపురుపల్లిలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను విమానం ఎక్కిస్తానని సత్యారావు తెలిపారు.