జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న ఎండలు
నిర్మల్: జిల్లాలో ఎండలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38°C నుంచి 40°C వరకు నమోదవుతుండగా, రాబోయే రోజుల్లో 42°C దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది.