VIDEO: 'పుంగమ్మ కట్టపై రక్షణ గోడను ఏర్పాటు చేయాలి'
CTR: పుంగనూరు పుంగమ్మ కట్టపై తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చెరువు కట్టపై వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. కొద్దిరోజుల క్రితం ఒక కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. చెరువు కట్టపై ఇరువైపులా సేఫ్టీ వాల్, లేదా కంచెను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.