ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
నల్గొండ సమీపంలోని ఆర్జల బావి వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ బీ. చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పట్లు చేసి సిద్ధంగా ఉంచడం జరిగిందని అన్నారు.