నూర్ మహమ్మద్‌కు ఎమ్మెల్యే పరామర్శ
ATP: అనంతపురంలో టీడీపీ నేత నూర్ మహమ్మద్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే.. నూర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. డివిజన్ నేతల మధ్య వ్యక్తిగత విభేదాల వల్లే మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడ్డారని వివరించారు.