శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు

ATP: గుంతకల్లు రాజేంద్రనగర్‌లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామి వారికి పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు, వేదమంత్ర పారాయణం, సుప్రభాత సేవ, వివిధ రకాల పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి వెండి కవచంతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.