'పర్యావరణం పరిరక్షించడం మన బాధ్యత'

'పర్యావరణం పరిరక్షించడం మన బాధ్యత'

NTR: పర్యావరణం పరిరక్షించడం మన బాధ్యతని విజయవాడ సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్‌స్టేషన్ ఆవరణంలో శనివారం ఆయన మొక్కలు నాటారు. పర్యావరణం రక్షించుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కని నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐ సౌజన్య, సిబ్బంది పాల్గొన్నారు.